Asianet News TeluguAsianet News Telugu

జన్మభూమి సభకు వెళ్తూ అదుతప్పిన పోలీస్ వాహనం...కానిస్టేబుల్ మృతి

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి సభలో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమ బందోబస్తుకు వెళుతూ ఓ పోలీస్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. అంతేకాకుండా వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. 
 
Constable Died in Accident at Chittoor
Author
Chitturu, First Published Jan 10, 2019, 4:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి సభలో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమ బందోబస్తుకు వెళుతూ ఓ పోలీస్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. అంతేకాకుండా వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని కల్లూరు గ్రామంలో జన్మభూమి గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ భద్రత కోసం పూతల పట్టు పోలీస్ స్టేషన్ ఎస్సై మల్లేష్ యాదవ్ ఐదుగురు కానిస్టేబుళ్లను తీసుకుని పోలీస్ వాహనంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుతప్పింది. రోడ్డు పక్కన వున్న ఓ చింతచెట్టుకు ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. 

ఈ ప్రమాదంలో ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం  గురించి తెలసుకున్న స్థానికులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 

అధికారిక కార్యక్రమానికి బందోబస్తు కోసం వెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ పోలీస్ అధికారి చనిపోవడం తీవ్రంగా బాధిస్తోందని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ తరపున మృతుడి కుటుంబాన్ని  అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి  ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  
 
Follow Us:
Download App:
  • android
  • ios