Asianet News TeluguAsianet News Telugu

ఏపి కాంగ్రెస్ లో కీలక మార్పులు... ఆ నాయకుడికే పగ్గాలు: మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్

ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే టిపిసిసి లో భారీ మార్పులు వుంటాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. 

Congress party forms government in ap and central... chinta mohan
Author
Visakhapatnam, First Published Oct 6, 2021, 1:44 PM IST

విశాఖపట్నం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎవ్వరితో ఎలాంటి పొత్తు లేకుండానే 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. దేశానికి రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని జోస్యం చెప్పారు. 

ఇక త్వరలోని ప్రజలకు అండగా వుంటానని భరోసా ఇచ్చేందుకు Rahul Gandhi ఏపీలో పర్యటించనున్నట్లు చింతా మోహన్ పేర్కొన్నారు. త్వరలోనే విశాఖపట్నం, గుంటూరుకి రాహుల్ గాంధీ వస్తారని... స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల పోరాటానికి మద్దతు పలుకుతారన్నారు.

vizag steelplant privatisation కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు... మేం అధికారంలో రాగానే విశాఖ ఉక్కు పరిశ్రమను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని ప్రకటించారు. మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిది తొందర పాటు చర్య అని... అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి, చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని చింతా మోహన్ అన్నారు. 

''దేశంలో నిరుద్యోగం, దారిద్య్రం బాగా పెరిగిపోయింది. గ్యాస్, డీజిల్, పెట్రల్ ధరలు ఈ ప్రధాని మోడీ హయాంలో విపరీతంగా పెరిగిపోయాయి. నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, ఇందిర హయాంలో విశాఖ ఉక్కు ఏర్పాటయ్యాయి. దేశానికి కాంగ్రెస్ విధానాలు, Nehru, Indira Gandhi తెచ్చిన సోషలిస్టు విధానాలే శరణ్యం'' అన్నారు. 

read more  బద్వేలు ఉప ఎన్నిక బరిలోకి కాంగ్రెసు: అభ్యర్థిగా కమలమ్మ

''ఏపీలో 80 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఆగిపోయాయి. జగన్ ప్రభుత్వం ఎస్సి, ఎస్టీ, ఓబిసి, మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్,  మెస్ బిల్లులు, పాకెట్ మనీ నిధులను పక్కదారి పట్టిస్తోంది. దీపావళి లోపు ఎస్సీ ఫైనాస్ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసి, నిధులు మంజూరు చేయాలి'' అని చింతా డిమాండ్ చేశారు. 

''త్వరలోనే ఏపి పీసీసిలో మార్పులు ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి నేతల కొరత ఉంది. మచ్చలేని నాయకుడు, ప్రజా ఆమోదయోగ్యమైన నాయకుడు కావాలి. అలాంటి నాయకుడికే ఏపి పిసిసి పగ్గాలు దక్కుతాయి'' అని తెలిపారు.  

''2004 లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడం వల్లే కాంగ్రెస్ కు తీరని నష్టం జరిగింది. అప్పుడు YS Jagan సీఎం కాకపోయి ఉంటే నేడు జగన్ బలపడేవాడు కాదు... సీఎం అయ్యేవాడు కాదు. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా వుండేది'' అని చింతా మోహన్ పేర్కొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios