కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన భారత్‌లో దుమారం రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీన్‌లోకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరారు. దీనికి మాణిక్యం ఠాగూర్ ఘాటుగా బదులిచ్చారు. 

నేపాల్‌ నైట్‌క్లబ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరో మహిళతో కనిపించిన వీడియోపై దేశవ్యాప్తంగా రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫ్రెండ్‌ పెళ్లికి రాహుల్‌ వెళ్తే కొందరు రాద్దాంతం చేయడం తగదని కాంగ్రెస్‌ నేతలు కౌంటరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ (ysrcp) ఎంపీ విజయసాయి రెడ్డి (vijayasai reddy) ఈ వ్యవహారంపై కీలక ట్వీట్ చేశారు. రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరో తేల్చి చెప్పారు. ఆమె పేరు హౌ యాంక్వీ అని వెల్లడించారు. నేపాల్‌లో చైనా దౌత్యవేత్తగా ఆమె పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 

ఈ వీడియో నేపథ్యంలో చైనా హనీట్రాప్ ఎత్తుగడలు మరోసారి చర్చకు వచ్చాయని అభిప్రాయపడ్డారు వైసీపీ ఎంపీ. ఈ సందర్భంగా ఆమె గతంలో నేపాల్‌లో చేసిన రాజకీయ ఎత్తుగడలను గుర్తు చేశారు. అంతేకాక, నరేంద్ర మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసర విమర్శలు చేసిందనీ, ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నేత వివాదంలో చిక్కుకున్నాడని విజయసాయి రెడ్డి చురకలు వేశారు. 

విజయసాయి రెడ్డి ట్వీట్‌పై కాంగ్రెస్‌ నేత, ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై వున్న అవినీతి కేసులు తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు గాంధీ వెళ్లారని.. పెళ్లికి హాజరుకావడంలో తప్పేముంది? అంటూ ఠాగూర్ ప్రశ్నించారు.

అంతకుముందు Nepal లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi నైట్ క్లబ్ కు హాజరైన వీడియోను BJP విడుదల చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటరిచ్చింది. మాజీ కేంద్ర మంత్రి Prakash Javadekar మద్యం బాటిల్ తో ఉన్న ఫోటోను కాంగ్రెస్ నేత Manickam Tagore ర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలని ఠాగూర్ ప్రశ్నించారు.

కాగా.. నేపాల్ జరిగిన పెళ్లికి రాహుల్ గాంధీ సోమవారంనాడు హాజరయ్యారు. నేపాల్‌కు చెందిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఖాట్మండ్‌కు వెళ్లారు. ఆమె గతంలో సీఎన్‌ఎన్ వార్తా సంస్థలో కరస్పాండెంట్ పనిచేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్. ఆయన మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు. అంతకుముందు, ఆగస్టు 2018లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్‌కు వెళ్లే మార్గంలో రాహుల్ గాంధీ ఖాట్మండును సందర్శించారు.

Scroll to load tweet…