Asianet News TeluguAsianet News Telugu

నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ లేఖ

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని కోరారు. గత 96ఏళ్లుగా ఆంధ్రాబ్యాంక్ తో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

congress mp kvp ramachandrarao writes a letter to union finance minister nirmala sitaraman
Author
Hyderabad, First Published Aug 31, 2019, 6:40 PM IST

హైదరాబాద్: ఆంధ్రాబ్యాంకు విలీనంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతుంటే, ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. 

తాజాగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని కోరారు. గత 96ఏళ్లుగా ఆంధ్రాబ్యాంక్ తో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని లేఖలో పేర్కొన్నారు. 

ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల మనోభవాలను గుర్తుంచుకుని ఆంధ్రాబ్యాంకు విలీనంపై పునరాలోచించాలని లేఖలో పేర్కొన్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. 

ఈ వార్తలు కూడా చదవండి

హెడ్ క్వార్టర్ తెలంగాణలో ఏర్పాటు చేయండి : కేంద్రానికి వైసీపీ ఎంపీ లేఖ

బ్యాంకుల విలీనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Follow Us:
Download App:
  • android
  • ios