విజయవాడ: ఆంధ్రాబ్యాంకు విలీనం నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  లకు లేఖ రాశారు వైసీపీ ఎంపీ బాలశౌరి. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగువారి మనోభవాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. 

ఆంధ్రాబ్యాంక్ ను విలీనం చేయెద్దని కోరారు. విలీనం తప్పనిసరైతే యూనియన్ బ్యాంక్ ను ఆంధ్రాబ్యాంకులో విలీనం చేయాలని కోరారు. అంతేకాదు ఆంధ్రాబ్యాంకు హెడ్ క్వార్టర్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. 

ఇకపోతే శుక్రవారం సాయంత్రం ఆంధ్రాబ్యాంకుతోపాటు మెుత్తం 10 బ్యాంకుల విలీనంపై కీలక ప్రకటన చేశారు కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇకపోతే ఆంధ్రాబ్యాంకు విలీనంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది. 

ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కొన్ని చోట్ల బ్యాంకు ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఆంధ్రాబ్యాంకు విలీనంపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరారు. బ్యాంకు ఉద్యోగులు, రాజకీయ నేతల నుంచి వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో కేంద్రం పునరాలోచిస్తుందా లేక విలీనం తప్పనిసరి అని తేల్చి చెప్తుందా అన్నది వేచి చూడాలి.