శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ లో ఉంది. టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈసారి జెండా ఎగురవెయ్యాలని వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు టీడీపీ నేతలకు జగన్ గేలం వేస్తున్నారు. 

అయితే తాజాగా ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా అలియాస్ లల్లూ బుధవారం వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆముదాల వలస నియోజకవర్గంలోని కృష్ణాపురం బస వద్ద జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లల్లూతోపాటు ఇచ్చాపురం మున్సిపల్ చైర్ పర్సన్ లాభాల స్వర్ణమణి కూడా వైసీపీలో చేరారు. 

ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన లల్లూ 2014 ఎన్నికల అనంతరం రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి పోటీ చేసిన ఆయన విభజన పుణ్యమా అంటూ ఘోరంగా ఓటమి చెందారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

తాను ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరానని లల్లూ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మెుదటి నుంచి తాను ఎంతో ఆసక్తితో ఉన్నానని అయితే కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయని ఫలితంగా ఆనాడు 

ఇకపోతే ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాపోరాట యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. జిల్లాకు చెందిన నేతలు లల్లూ ప్రస్తావనపై పవన్ కళ్యాణ్ తో చర్చించారని ప్రచారం జరిగింది.