ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఏపీలో ప్రత్యేక మోదా కోసం పోరాటం చేసినవారిపై నమోదైన కేసులను ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కేవీపీ చంద్రబాబుకి దన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. ఏపీకి న్యాయం చేయాలని ప్రధానికి సోనియా లేఖ రాశారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని కేవీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.