Asianet News TeluguAsianet News Telugu

BC caste census: ఏపీలో బీసీ కులాల గణన నిర్వహించండి.. : కాంగ్రెస్‌

Amaravati: కుల గణనపై తీర్మానం చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లను ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అభినందించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్ లతో పాటు అధికార డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న తమిళనాడులో ఇప్పటికే బీసీ కుల గణన ప్రారంభమైందని తెలిపారు.
 

Conduct BC caste census in AP, demands Congress, APCC president Gidugu Rudra Raju RMA
Author
First Published Oct 18, 2023, 3:07 PM IST

APCC president Gidugu Rudra Raju: బీసీ కులాల గణనను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. బీసీ కులాల గణనతో అనేక సామాజిక, రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ జనాభా గణన నిర్వహించడం ద్వారా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను నిరూపించుకోగలదని అన్నారు. కుల గణన కోసం ప్రభుత్వం వాలంటీర్లు, వార్డు సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.

దేశవ్యాప్తంగా బీసీ కులాల గణన చేపట్టాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కుల గణనపై తీర్మానం చేసినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను ఆయ‌న‌ అభినందించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడులో కాంగ్రెస్‌ అధికార డీఎంకేతో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాల్లో బీసీ కులాల గణన ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. 

బీహార్‌లో పూర్తయిన కుల గణన దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు. బీసీ కులాల గణన ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు అక్టోబరు 21న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఏపీసీసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యుడు డాక్టర్‌ ఎన్‌ రఘువీరారెడ్డి, సీనియర్‌ నేత కొప్పుల రాజు, ఇతర నేతలు హాజరుకానున్నారు. వచ్చే నెలలో నంద్యాల, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఏపీసీసీ ఇదే తరహాలో సమావేశాలు నిర్వహించనుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios