Asianet News TeluguAsianet News Telugu

శుభవార్త:ఏపీఎస్ఆర్టీసీ విలీనానికి జగన్ లైన్ క్లియర్

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సర్కార్ లైన్ క్లియర్ చేసింది.ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Committee to submit report over merge of APSRTC in government
Author
Amaravathi, First Published Sep 3, 2019, 6:31 PM IST

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు లైన్‌క్లియర్ అయింది. ఈ నెల 4వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 

ఎన్నికల సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ రిటైర్డ్ ఐపీఎస్  అధికారి ఆంజనేయ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఇచ్చింది.   పూర్తి స్థాయి నివేదికను మంగళవారం నాడు సీఎం జగన్ కు ఆంజనేయ రెడ్డి కమిటీ ఇచ్చింది.

పబ్లిక్  ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ను ఏర్పాటు చేసి ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్టుగా ఈ నెల 4వ తేదీన జరిగే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఆంజనేయ రెడ్డి కమిటీ పలు అంశాలను తన నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదికకు రేపు జరిగే కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. ప్రస్తుతం ప్రతి నెలా ఏపీఎస్ఆర్టీసీ  సంస్థలో పనిచేసే ఉద్యోగులకు వేతనాల కోసం రూ. 3300 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే  ఈ నిధులను ప్రభుత్వం చెల్లించనుంది.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios