పోలీసులకు ఫిర్యాదు చేసిన వేణుమాధవ్

వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హాస్య నటుడు వేణు మాధవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన గత కొద్ది రోజులుగా నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మామాలుగానే ప్రచారం చేస్తూ వచ్చిన వేణుమాధవ్ కు మధ్య లో పూనకం రావడం మొదలయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల కిందట ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన వొళ్లు మర్చిపోయాడు. సినిమా యాక్టర్లు ప్రచారం చేస్తున్నట్లు కాకుండా అచ్చు రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతూ జగన్ బట్టే బాజ్ అని, దొంగ అని రకరకాలు దూషించాడు, ముఖ్యమంత్రి మెప్పుకోసం. అయితే, ఇపుడు ఆయన జగన్ పార్టీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటున్నాడు.

జగన్ మీద చేసిన వ్యాఖ్యలకు వేణుమాధవ్ కు విమర్శలొచ్చాయి. పోన్ చేసి తమ వ్యతిరేకత తెలిపారు,. దీనిని ప్రస్తావిస్తూ కొంతమంది వైసీపీ నాయకులు తనకు పోన్ చేసి బెదిరించినట్లు ణుమాధవ్‌కు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్