ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో వైరస్ ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా సరికొత్త ఆంక్షలు అమల్లోకి తీసుకువస్తోంది.

బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా సమయాల్లో మాస్కు ధరించటాన్ని తప్పని సరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

కేంద్ర హోం శాఖ సూచించిన నిర్దేశిత ప్రమాణాల్లో భాగంగా ఫేస్ మాస్కు, ముఖం కప్పు కునేలా కవర్ ఉండటాన్ని తప్పని సరి చేస్తూ ఆదేశిలిచ్చింది.. 

ప్రజలు మాస్కు ధరించేలా విస్తృత ప్రచారం కల్పించడం తో పాటు, మాస్కు ధరించటాన్ని అలవాటు గా మార్చుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లు, క్షేత్ర-స్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. 

లాక్‌ డౌన్‌ సమయం లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణం గానే ఫేస్‌ మాస్కు తప్పని సరి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు..