కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కొందరు కాలేజీ విద్యార్థినులు సీఎం జగన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేాసారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసారు. రూ.708 కోట్ల రూపాయలను పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాలో జమచేసారు. కృష్ణా జిల్లా పామర్రులో విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో ఈ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సమస్యలు అడ్డురాకూడదనే ఈ విద్యాదీవెన పథకాన్ని తీసుకువచ్చినట్లు వైసిపి ప్రభుత్వం. ఉన్నత చదువులు

అయితే ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు విద్యార్థులు ముఖ్యమంత్రి జగన్ ను ఆకాశానికి ఎత్తేసారు. షణ్ముక సాయిప్రియ అనే విద్యార్థిని మాట్లాడుతూ... అమ్మలో సగం, నాన్నలో మరోసగం కలిస్తే అన్న... ఈ పదానికి సరైన నిర్వచనం జగనన్నే అని పేర్కొంది. అమ్మలా గోరుముద్దలు పెడుతూ... నాన్నలా బాధ్యతగా ఫీజులు కడుతున్న గొప్ప మనసు జగనన్నది అంటూ కొనియాడింది విద్యార్థిని. 

ఇక తన కుటుంబం కష్టకాలంలో వుండటంతో చదువు కొనసాగించడం ఎలాగని మదనపడుతున్న సమయంలో జగనన్న విద్యాదీవెన అండగా నిలిచిందని సాయిప్రియ తెలిపింది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా కృష్ణా యూనివర్సిటీలో బిటెక్ చదువుతున్నానని తెలిపింది. గతంలో తన తండ్రి స్కాలర్ షిప్ ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం చూసానని.. కానీ ఇప్పుడు నేరుగా తన తల్లి ఖాతాలో డబ్బులు పడుతున్నాయని తెలిపింది. ఇలా ప్రతిపక్షం ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని సాయిప్రియ వెల్లడించింది. 

ఇక మరో విద్యార్థిని దిల్షాద్ మాట్లాడుతూ... విద్య దీవెన ద్వారా అనుకున్న కాలేజీలో చదువుకోగలుగుతున్నానని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో శ్రద్దగా చదువుకుంటున్నానని... ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నానని తెలిపింది. సాప్ట్ వేర్ జాబ్ కు కూడా అర్హత సాధించినట్లు దిల్షాద్ తెలిపింది. 

ఇంగ్లీష్ రచయిత మాల్కం గ్లాడ్ వెల్ 'టెన్ థౌంజండ్ అవర్స్' థియరీని ఈ సందర్భంగా దిల్షాద్ గుర్తుచేసారు. ఇది జగనన్నకు సరిగ్గా సరిపోతుందని... ఆయన కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్యన గడిపారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడన్నారు. తాను కూడా ఇలాగే కష్టపడి జీవితంలో ఉన్నతస్థానానికి చేరుతానని... అప్పుడు మళ్లీ జగనన్న దగ్గరకు వచ్చి మాట్లాడతానని దిల్షాద్ ధీమా వ్యక్తం చేసింది.