బ్రేకింగ్ న్యూస్:భూకబ్జాలపై విచారణ..బోండా ఉమాకు షాక్

బ్రేకింగ్ న్యూస్:భూకబ్జాలపై విచారణ..బోండా ఉమాకు షాక్

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ బోండా ఉమా మహేశ్వరరావుకు కలెక్టర్ పెద్ద షాక్ ఇచ్చార. బోండా చేసిన భూ కబ్జాలపై కలెక్టర్ సూమోటాగా విచారణ చేపట్టారు. స్వాతంత్ర్య సమరయోధునికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని బోండా అక్రమంగా సొంతం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.

భూమిపై అప్పు ఇప్పిస్తానని చెప్పి రిజిస్ట్రార్ కార్యాలయంకు తీసుకెళ్లి సంతకాలు చేయించుకున్నారు. తర్వాత భూ యజనామికి అనుమానం వచ్చి ఆరాతీస్తే తన భార్య పేరుపై మొత్తం భూమిని బోండా రాయించేసుకుని రిజిస్టర్ చేయించుకున్నారని తేలింది. దాంతో బాధితుల వారుసులు విజయవాడ పోలీసు కమీషనర్ కే కాకుండా సిఐడికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం వెలుగు చూడటంతో మీడియాలో బాగా ప్రచారమైంది.

దాంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. విచారణలో బోండా నిర్వాకమంతా బయటపడింది. దాంతో పోలీసులు బోండా ఉమ భార్య సుజాతతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. ఇపుడా కేసుపైనే జిల్లా కలెక్టర్ సూమోటాగా విచారణ మొదలుపెట్టారు. శనివారం మధ్యాహ్నం బోండా ఉమ, భార్యతో పాటు బాధితులు కూడా విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. ఆర్డీవో విచారణ చేస్తారు.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos