ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ హాజరుకానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మే 3వ తేదీన విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ హాజరుకానున్నారు. విశాఖలో వైజాగ్ టెక్ పార్క్‌ను అదానీ గ్రూప్ అభివృద్ది చేయనుంది. ఇక, ఇప్పటికే అదానీ గ్రూపు వైజాగ్‌ టెక్‌పార్క్‌ లిమిటెడ్‌ పేరుతో 100 మెగా­వాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం 60.29 ఎకరాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

విశాఖపట్నం కాపులుప్పాడ వద్ద రూ. 7,210 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌తోపాటు ఐటీ, బిజినెస్‌ పార్క్, స్కిల్‌ సెంటర్, రిక్రియేషన్‌ సెంటర్లను అదానీ గ్రూపు అభివృద్ధి చేయనుందని సంబంధింత వర్గాలు తెలిపాయి. దీనిద్వారా 14,825 మందికిఉపాధి లభించనుందని పేర్కొన్నాయి. ఇక, ఐదు దశల్లో డేటా సెంటర్‌ను అభివృద్ది చేయనున్నారు.