Asianet News TeluguAsianet News Telugu

Heavy Rains : జగన్ సమీక్ష.. ఆ కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం.. వారికి వెంటనే కొత్త ఇల్లు...

నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండాలని. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

cm ys jagan review meeting with officials on flood affected areas andhrapradesh
Author
Hyderabad, First Published Nov 22, 2021, 1:07 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి :  భారీ వర్షాల కారణంగా ఏపీ లోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద సహాయక చర్యలపై అసెంబ్లీ ఛాంబర్లో అధికారులతో సోమవారం  సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

 సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ..
- వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి
- వారిపట్ల మానవతా దృక్పథాన్ని చూపించండి
- తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించండి
- 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె,  కేజీ ఉల్లిపాయ,  కేజీ ఆలుగడ్డ,  రెండు వేల రూపాయలు ఇవ్వాలి
- గ్రామాన్ని, వార్డును యూనిట్ గా తీసుకోవాలి
- Volunteersసేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికి సహాయం అందించాలి
- ముంపుకు గురైన ప్రతి ఇంటికి  ఈ పరిహారం  అందాలి
-  ఎవ్వరికి  అందలేదు అన్నమాట రాకూడదు
- relief campsలో ఉన్న వారికి మంచి వసతులు సదుపాయాలు కల్పించండి
- వారికి అందించే సేవల్లో ఎక్కడ లోటు రానీయ కూడదు
- ప్రభుత్వం బాగా చూసుకుంటుదనే మాట వినిపించాలి.
- వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ. 2000 ఇవ్వాలి
- విద్యుత్  పునరుద్ధరణ,  Protected drinking waterని అందించడం  యుద్ధ ప్రాతిపదికన చేయాలి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి
- 104 Call Center ఇప్పటికే ప్రజలందరికీ పరిచయం ఉంది. ఈ నెంబర్ కు విస్తృతంగా ప్రచారం కల్పించండి
- వరదలకు సంబంధించి  ఏ ఇబ్బంది ఉన్నా… ఈ నెంబర్ కు  సమాచారం ఇవ్వమని  చెప్పండి
- 104కు ఎలాంటి సమస్య వచ్చినా..  వెంటనే అధికారులు స్పందించి victimsకు తోడుగా నిలవాలి
- జిల్లాలో 104కు ప్రత్యేక అధికారిని నియమించండి
- Sanitation, medical camps నిర్వహణపై దృష్టి పెట్టండి
- ఎక్కడ అవసరమవుతుందో.. అక్కడ పెట్టండి,  ఒక డ్రైవ్ లా చేయండి
- రోడ్లను పునరుద్ధరించడంపై  దృష్టి పెట్టండి
- రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలి
- శాశ్వతంగా చేయాల్సిన పనుల పై కార్యాచరణ రూపొందించాలి
- ఇప్పుడు వచ్చిన  వరదను దృష్టిలో ఉంచుకొని  ఆ మేరకు  డిజైన్ రూపొందించి  శాశ్వత పనులు చేపట్టాలి
- వచ్చే నాలుగు వారాల్లో  టెండర్లను ఖరారు చేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
- Panchayati Raj, Municipal Departments దీనిపై చర్యలు తీసుకోవాలి
- ఇల్లు కూలిపోయినా,  పాక్షికంగా దెబ్బతిన్నా...వారికి వెంటనే నగదు ఇవ్వండి
- పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 డబ్బులు ఇవ్వండి
- దీంతోపాటు ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయండి
- దీని వల్ల వెంటనే పనులు మొదలుపెట్ట గలుగుతారు
- పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5200 నగదు  వెంటనే అందించేలా చూడాలి
- ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90 శాతం మేర నష్టపరిహారం అందించారు
- మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి
- చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండి
- Nelloreలో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండండి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండి. ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి. 
- విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్సోయారు కాబట్టి.. మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు
- వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి
- మరణించిన పశువుల కళేబరాల వల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండి…
- పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి
- వ్యాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి
- పంటల నష్టం ఎన్యుమరేషన్ మొదలుపెట్టండి
- విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండి
- చెరువులు, ఇతర జలాశయాలు, గట్టుమీద దృష్టి పెట్టండి
- నిరంతరం అప్రమత్తంగా ఉండండి
- ఎప్పుటికప్పుడు వారు నివేదికలను అధికారులకు అందించాలి
- బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెల్తున్నట్టు చెప్తున్నారు. అయినా, సరే చాలా అప్రమత్తగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండండి
- కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయం కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం
- అధికారులు అంతా డైనమిక్ గా పనిచేయాలి
- ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకురండి
- విద్యుత్ పునరుద్ధరణతో ఎలాంటి అలస్యం ఉండకూడదు
- సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండి
- వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్ స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపులేని ప్రాంతాలకు తరలించారు
- పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీ చేశాం
- పశువులు మరణిస్తే.. నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండి
- గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతపదికన చర్యలు చేపట్టాలి
- పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

కాగా, ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకో సీనియర్ అధికారిని నియమించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కమిషనర్ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios