Asianet News TeluguAsianet News Telugu

లబ్దిదారులకు సర్వహక్కులు: తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించిన జగన్

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న  సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు.  ఈ ఇంటిపై సర్వహక్కులను కల్పించామని సీఎం జగన్ చెప్పారు.

CM YS Jagan  launches Jagananna Sampoorna Gruha Hakku scheme in Tanuku
Author
Tanuku, First Published Dec 21, 2021, 1:37 PM IST

 తణుకు:ఇల్లు అంటే ఇటుక, స్టీల్ తో కట్టిన కట్టడమే కాదు సుధీర్ఘకాం పడిన కష్టానికి ప్రతిరూపమని ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.Jagananna Sampoorna Gruha Hakku scheme కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని Tanuku లో  ఏపీ సీఎం Ys Jaganమంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  ప్రతి మ:హిళ చేతిలో రూ. 5 నుండి రూ. 10 లక్షల ఆస్తిని పెడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల మందికి సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు.ఈ పథకం కింద దాదాపు రూ. 10 వేల కోట్ల రుణమాఫీని అందిస్తున్నామన్నారు సీఎం జగన్.

పేదల సొంతింటి కలను ఓటీఎస్ పథకంతో నిజం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ చెప్పాు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా ఓటీఎస్ పథకాన్ని చేపడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.  ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ళ నిర్మాణాల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.  25 వేల కోట్ల రూపాయాల విలువైన 31 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేశామని సీఎం జగన్ చెప్పారు.  లబ్దిదారులకు సర్వహక్కుల కల్పనకే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని తీసుకొచ్చామన్నారు.గతంలో నివసించే హక్కు స్థానంలో సర్వహక్కులతో రిజిస్ట్రేషన్ కల్పించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని రుణాలు తీసుకొనే వెసులుబాటును కూడా కల్పిస్తామన్నారు సీఎం జగన్. రిజిస్ట్రేషన్ చేసిన ఇంటికి చేయని ఇంటికి చాలా తేడా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. గతంలో కేవలం నివసించే హక్కు మాత్రమే ఉన్న లబ్దిదారులను ఇవాళ్టి నుండి పూర్తి స్థాయి యజమానులుగా మారనున్నారని సీఎం జగన్ చెప్పారు. ఈ పథకం కింద దాదాపుగా రూ. 10 వేల కోట్ల రుణమాఫీతో పాటు  రూ. 6 వేల కోట్ల రిజిస్ట్రేషన్ స్టాంట్ డ్యూటీ చార్జీలను మినహాయింపుతో దాదాపు రూ. 16 వేల కోట్ల మేర లబ్ది చేకూరనుందని సీఎం జగన్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios