ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్ఢినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్ఢినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ‘‘జగనన్నే మా భవిష్యత్తు’’ క్యాంపెయిన్ అజెండాపై సీఎం జగన్ పార్టీ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే గడప గడపకు కార్యక్రమంపై కూడా సమీక్షించనున్నారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రోగెస్ రిపోర్ట్‌ను ప్రదర్శించనున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలను హెచ్చరించే అవకాశం ఉంది.
ఇక, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఎంపికకు సంబంధించిన తుది జాబితాలను నేతలు సీఎం జగన్‌కు సమర్పించే అవకాశం ఉంది. సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ఎంపిక ఈ నెల 10వ తేదీన డెడ్‌లైన్ ముగిసిన సంగతి తెలిసిందే.
ఇక, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాల్లో వెళ్లాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ నేతలతో ఈ విషయంపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతంర జనాల్లోకి వెళ్లేలా ఇప్పటికే సీఎం జగన్ ప్రణాళికులు సిద్దం చేసుకుంటున్నట్టుగా సమాచారం.
అయితే ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్టానం ఆదేశించాలని నేపథ్యంలో.. వారిలో సీఎం జగన్ ఏం చెబుతారనే టెన్షన్ నెలకొంది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు పలు అంశాలపై సీఎం జగన్ మార్గనిర్దేశనం చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే..ఫిబ్రవరి 20న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి 'జగనన్న మా భవిష్యత్' అనే మెగా క్యాంపెయిన్ ను ప్రారంభించనున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ తమ నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రోజూ కనీసం 25 నుంచి 30 ఇళ్లకు చేరుకుంటారు. సచివాలయం కన్వీనర్లు, గృహ పెద్దలు (గృహ సారధులు), గ్రామ, వార్డు వలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ఇంటింటి ప్రచారం ఒకే రోజు 15 వేల సచివాలయాల్లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 27 నాటికి ఈ ప్రచారాన్ని పూర్తి చేయాలని వైసీపీ అధిష్ఠానం యోచిస్తోంది.
