Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి: మోడీకి జగన్ వినతి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి వినతి పత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల చేయాలన్నారు.

CM YS Jagan AsksTo PM Modi special status for Andhra Pradesh
Author
Guntur, First Published Jul 4, 2022, 6:47 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి Special Status ఇవ్వాలని ఏపీ సీఎం YS Jagan  ప్రధానమంత్రి Narendra Modiకి వినతి పత్రం సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణ సభలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోడీ తిరుగు ప్రయాణమయ్యే సమయంలో గన్నవరం ఎయిర్ పోర్టులో  ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ వినతి పత్రం సమర్పించారు.

విభజనతో Andhra Pradesh రాష్ట్రం పూర్తిగా దెబ్బతిందని జగన్ చెప్పారు. విభజనతో దెబ్బతిన్న ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ఆ వినతి పత్రంలో కోరారు.  మరో వైపు Polavaram ప్రాజెక్టు అంశాన్ని కూడా జగన్ ఈ వినతి పత్రంలో ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.ఈ నిధులను అందించాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.

 అంతేకాకుండా Telangana రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలను వచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ విద్యుత్ సంస్థలకు రూ.6,627.28 కోట్లు చెల్లించాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు  చేస్తున్న వైద్య కళాశాలకు ఆర్ధిక సహాయం చేయాలని  జగన్ ఆ వినతి పత్రంలో కోరారు. 

భోగాపురం ఎయిర్ పోర్టుకు అన్ని రకాల క్లియరెన్స్ లను ఇవ్వాలని కోరారు.ఏపీఎండీసీకి ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని  కోరారు. రీసోర్స్  గ్యాప్ కింద రాష్ట్రానికి 34,125.5 కోట్లు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు.జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ సరఫరా విషయంలో తమ రాష్ట్రానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.


యూపీఏ ప్రభుత్వం  రాష్ట్ర విభజన సమయంలో పలు అంశాలను ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కూడా తీసుకు వచ్చింది.  రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్టుగా తెలిపంది. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు ఏపీలో అధికరంలో ఉన్న టీడీపీ కూడా భాగస్వామ్యమైంది. ప్రత్యేక హోదాకు సమానమైన ప్రత్యేక ప్యాకేజీని ఏపి ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని తీసుకున్న టీడీపీపై ఆనాడు విపక్షంలో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహింంచింది. జనసేన పార్టీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వని ీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది.  ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఎన్డీఏకు దూరమైంది. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి అన్యాయం చేశారని మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ సర్కార్ పై అవిశ్వాసం కూడా పెట్టారు.  ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

2019 ఎన్నికల సమయంలో కూడా ప్రత్యేక హోదా ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. అయితే కేంద్రంలో బంపర్ మెజారిటీతో  బీజేపీ అధికారంలోకి వచ్చింది.  దీంతో ప్రత్యేక హోదా విషయమై కేంద్రానికి ఏపీ సీఎం జగన్ వినతి పత్రాలు సమర్పించారు. కానీ కేంద్రం నుండి ఈ విషయమై సానుకూల స్పందన లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. ఈ తరుణంలో ఇవాళ ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధానికి మరోసారి సీఎం జగన్ ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు

Follow Us:
Download App:
  • android
  • ios