ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైరల్ ఫీవర్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు మధ్యాహ్నం సీఎం జగన్ అపాయిట్‌మెంట్లను రద్దు చేశారు. ఇదిలాఉంటే, సీఎం జగన్ ఈరోజు ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో జగన్ డల్‌గా కనిపించినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్‌ను కలిసేందుకు ఇచ్చిన అపాయింట్‌మెంట్లు అన్నింటినీ అధికారులు రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. మొత్తంగా 49 అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం తీసుకొచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈ పథకం కింద ప్రోత్సహకం అందజేయాలని నిర్ణయించారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి రూ. 50 వేలు, సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణులైన వారికి రూ. లక్ష ప్రోత్సాహకం నిర్ణయం తీసుకున్నారు. సామాజికంగా, ఆర్దికం వెనుక బడినవారికి ఈ పథకం వర్తింపజేయనున్నారు.
ఇక, కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసి అధికారులు వెళ్లిపోయాక మంత్రులతో తాజాగా రాజకీయ అంశాలపై సీఎం వైఎస్ జగన్ చర్చించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో చేసిన అవినీతిపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని సీఎం జగన్ మంత్రులకు చెప్పారని సమాచారం. మరో వైపు దసరా నుండి విశాఖపట్టణం నుండి పాలన సాగించనున్నట్టుగా జగన్ తేల్చి చెప్పారు.