అమరజీవి పొట్టి శ్రీరాములు, భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్ వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు సీఎం జగన్ పూలు సమర్పించి నివాళి అర్పించారు. 

అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు (potti sriramulu) 69వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం జగన్ (ys jagan) నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలు సమర్పించి సీఎం జగన్ నివాళి అర్పించారు. భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్ (sardar vallabhai patel) వర్ధంతి కూడా ఇవాళే కావడంతో ఆయన చిత్రపటానికి కూడా సీఎం జగన్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి (yv subbareddy), ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు (maddali giridhar rao), ఏపీ స్టేట్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ (kuppam prasad) తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు, వల్లభాయ్ పటేల్ కు నివాళులర్పించారు. 

విజయవాడ (vijayawada)లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ (chelluboina srinivas venugopal krishna) కూడా పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులుబాసారని గుర్తుచేసారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయనకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. అమరజీవి స్పూర్తితోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి వేణుగోపాల్ పేర్కొన్నారు. 

Video

పొట్టి శ్రీరాములు ఆశయాలను ముఖ్యమంత్రి నెరవేర్చుతున్నారని అన్నారు. ఈబీసీ నేస్తం ద్వారా బీసీలందిరికీ మేలు జరుగుతోందని మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు ఏ లోకంలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దీవిస్తారని మంత్రి పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ యాగం చేస్తున్నారని... కానీ కుట్రలు, కుతంత్రాలతో ప్రతిపక్షాలు ఆ యాగానికి విఘాతం కల్పిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ప్రజలంతా ప్రతిపక్షాల కుట్రలను గమనిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ పేర్కొన్నారు.