Asianet News TeluguAsianet News Telugu

సీఎం మాటలు జోక్ ఆఫ్ ది ఇయర్

  • ముఖ్య‌మంత్రి మాట్లాడుతుంటే ద‌య్యాలు వల్లిస్తున్నట్లున్నాయి.
  • బాబు మాట‌లు "జోక్ ఆఫ్ ద ఇయ‌ర్" గా వర్ణించారు.
  • కులాల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారు. 
CM words joke of the year says srikanth reddy

ముఖ్య‌మంత్రి మాట్లాడుతుంటే ద‌య్యాలు వల్లిస్తున్నట్లున్నాయ‌ని  వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అందరు సత్యాలే పలకాలని బాబు నీతులు వల్లిస్తున్నారని, బాబు మాట‌లు "జోక్ ఆఫ్ ద ఇయ‌ర్" గా వర్ణించారు. సీఎం స్థాయి లాంటి వ్య‌క్తి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టడం శోచ‌నీయమ‌న్నారు. కులాల మ‌ధ్య టీడీపీ చిచ్చుపెడుతూ.. త‌మ పార్టీ పైన రుద్దే కుట్ర చేశార‌ని తెలిపారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ సీఎం పై దుమ్మెత్తిపోశారు.

2014 లో టీడీపీ మెనిఫేస్టో లో ఇచ్చిన హామీలు సాధ్యా అసాధ్యాలపై ఎలక్షన్ కమీషన్ ప్రశ్నిందిందన్నారు. "దానికి స‌మాధానం ఇచ్చిన బాబు... అన్ని ఆధాయ వ‌న‌రులు చూసుకొని హామీల‌ను ఇచ్చామ‌నే" విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇదే విషయాన్ని శ్రీకాంత్ ప్రస్తావిస్తూ... "ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్నింటినీ అమలు చేశారని" చంద్రబాబును నిలదీశారు. హామీల అమ‌లుపై ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలని ఇప్పడు సాధ్యం కాదనడం అత్యంత శోచ‌నీయ‌మ‌న్నారు. వైసీపీ నేతలు హామీల అమలుపై ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం తిరిగి ఎదురుదాడికి దిగుతోంద‌ని మండిపడ్డారు.


కులాల వారిగా ఎవరికి ఏం హామీలు ఇస్తున్నామో అని మెనిఫేస్టోలో 10 పేజీలకు పైగా ప్రచురించారన్నారు. ఎన్నిక‌ల ముందు హామీల పేరుతో చంద్ర‌బాబు అన్ని కులాల‌ను మోసం చేశార‌న్నారు. కులాల పేరిట హామీలు ఇచ్చిన బాబు అమ‌లుపై ప్ర‌శ్నిస్తే కులాల మధ్య గొడవలు పెట్టారని, పైగా ఆ గొడవలను తమ పార్టీపై తోసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్ర‌బాబు పై 18 కేసులున్నా విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకొని బ‌య‌ట తిరిగుతున్నారని విమర్శించారు. పైగా త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ పై సీఎం నింద‌లు వేయడం త‌గ‌ద‌ని సూచించారు. ప్ర‌జ‌ల‌ను ముఖ్యమంత్రి మోసం చేసే విధానం అంద‌రు గ‌మ‌నిస్తున్నారు, త్వ‌ర‌లోనే టీడీపీకి బుద్ది చెబుతార‌ని ఆయ‌న విమర్శించారు.

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి....

 

Follow Us:
Download App:
  • android
  • ios