(వీడియో) అమరావతి అంబేద్కర్ స్మృతివనానికి శంకుస్థాపన

cm lays foundation for Ambedkar Smrutivanam at Amaravati
Highlights

దళితుల ఆరాధ్య దైవం, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్  స్ఫూర్తిని భావితరాలకు అందజేయడం  కోసం నేను  పనిచేస్తాను: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

రాజధాని అమరావతి సమీపంలోని అయనవోలు గ్రామంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు భూమి పూజ చేశారు.

 

భూమి పూఅంబేద్కర్ 126వ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయడంతో నా జన్మధన్యమైందని ముఖ్యమంత్రి అన్నారు.

 

 

 

సమాజంలోని కుల వివక్షను, అన్యాయాలను రూపుమాపడానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కొనియాడారు.

 

అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్య దైవం, రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్  స్ఫూర్తిని భావితరాలకు అందజేయడం నా ధ్యేయం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ కార్యక్రమంలో  సాంఘీక, సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఇతర మంత్రులు నారా లోకేశ్ జవహార్, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, ఎంపీ కొనకళ్ల నారాయణ..ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, బౌద్ధ బిక్షువులు తదితరులు పాల్గొన్నారు.

loader