ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(ఫిబ్రవరి 15) రోజున వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా సున్నపురాళ్లపల్లె గ్రామంలో స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(ఫిబ్రవరి 15) రోజున వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా సున్నపురాళ్లపల్లె గ్రామంలో స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు. పులివెందులలో ఓ వివాహ రిసెప్షన్ వేడుకకు కూడా సీఎం జగన్ హాజరు కానున్నారు. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ విషయానికి వస్తే.. బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. 

ఉదయం 11.10 నుంచి 11.30 గంటల వరకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం 11.45 నుంచి 12.45 గంటల వరకు స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.00 నుంచి 2.15 గంటల వరకు పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇక, జమ్మలమడుగు ప్రాంతంలో ప్లాంట్ నెలకొల్పేందుకు రెండు దశల్లో రూ.8,800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఆఫర్ చేసింది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో, దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించే అంచనాలు ఉన్నాయి. జమ్మలమడుగు ప్రాంతంలో ప్రాజెక్టు కోసం మొత్తం 3,295 ఎకరాలు సేకరించారు.

ఇదిలా ఉంటే.. 2019 డిసెంబర్ 23న సున్నపురాళ్ల పల్లె గ్రామంలో సీఎం జగన్ ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌కు శంకుస్థాపన చేశారు. సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో.. కంపెనీ హై-గ్రేడ్ స్టీల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయవలసి ఉంది. అయితే ఆ తర్వాత పలు కారణాలతో పెట్టుబడులు పెట్టే కంపెనీలలో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా 

ప్రాజెక్ట్‌లో మొదటి మరియు రెండవ దశల పనులను కలుపుకొని 8,800 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టడం ద్వారా జేఎస్‌డబ్ల్యూ సంస్థ పరిశ్రమను స్థాపించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థ తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరించనుంది.