రేపు విజయవాడలో దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. దాదాపు రూ.70 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ దర్శనానికి వెళ్లనున్నారు. రాష్ట్రంలో దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై వివాదాలు రేకెత్తడంతో ప్రభుత్వం తమ వ్యూహాన్ని మార్చింది.

దేవాలయాల పునరుద్ధరణ పేరుతో సరిదిద్దే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దీనిలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఎనిమిది దేవాలయాలకు ఆడంబరంగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

2016లో విజయవాడలో వివిధ కారణాలతో తొలగించిన 17 దేవాలయాల నిర్మాణానికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రణాళికలు రూపొందించారు