AP Cabinet Reshuffle: నేడు మధ్యాహ్నం రాజ్‌భవన్‌కి కొత్త మంత్రుల జాబితా


ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త మంత్రుల జాబితాను ఇవాళ మధ్యాహ్నం రాజ్ భవన్ కు పంపనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కినవారికి సీఎం జగన్ స్వయంగా ఫోన్ చేసే అవకాశం ఉంది. 

CM Jagan To Send New Cabinet List To Rajbhavan Today


అమరావతి: AP Cabinet Reshufle కు ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. కొత్త మంత్రుల జాబితాను సీఎం సిద్దం చేసుకొన్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం YS Jagan కొత్త మంత్రులకు ఫోన్ చేసి ఆహ్వానించనున్నారు.  ఆయా జిల్లాల వారీగా సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని సీఎం జగన్  కేబినెట్  ‌పై కసరత్తు చేశారు. కేబినెట్ కూర్పు విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు  Sajjala Ramakrishna Reddyతో సీఎం జగన్ ఇవాళ మరోసారి  చర్చించే అవకాశం ఉంది. 

ఆదివారం నాడు మధ్యాహ్ననికి కొత్త మంత్రుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం Rajbhavan కు పంపనుంది.  ఈ నెల 7వ తేదీన మంత్రుల నుండి తీసుకున్న రాజీనామాలను కూడా రాజ్ భవన్ కు పంపనున్నారు. పాత మంత్రుల రాజీనామాలను ఆమోదించిన తర్వాత రాజ్ భవవన్ గెజిట్ ను విడుదల చేయనుంది. కేబినెట్ పునర్వవ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పాస్ ల జారీతో పాటు ఇతర ఏర్పాట్లను చేశారు.  గత మంత్రివర్గంలోని 10 మంది పాత మంత్రులను సీఎం జగన్ కొనసాగించే అవకాశం ఉంది. సీనియర్టీని దృష్టిలో ఉంచుకొని వారికి కేబినెట్ లో మరోసారి చోటును కల్పించే అవకాశం ఉంది.  

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. New Districts నుండి కూడా మంత్రుల ప్రాతినిథ్యం ఉండేలా కూడా మంత్రివర్గం కూర్పు ఉండనుంది. అదే సమయంలో సామాజిక సమీకరణాలను కూడా జగన్ పాటించనున్నారు. అగ్రవర్ణాల కంటే బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేయనున్నారు.  మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను ఎక్కువ సంఖ్యలో తీసుకొనే అవకాశం ఉంది.

మరోవైపు పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుండి జగన్ వెన్నంటి ఉన్న వారికి కూడా పునర్వవ్యవస్థీకరణలో చోటు దక్కనుంది.  గత మంత్రివర్గంలో కూడా జగన్ ఇదే రకమైన పద్దతిని అవలంభించారు. తన వెన్నంటి ఉన్న వారికే మొదటి మంత్రివర్గంలో చోటు కల్పించారు.  గత టర్మ్ లో  మంత్రివర్గంలో చోటు దక్కనివారికి ఈ దఫా  కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది. 

సామాజిక సమీకరణాలు లేదా ఇతరత్రా కారణాలతో వారికి Cabinet లో చోటు కల్పించలేకపోతే నామినేటేడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో  అసెంబ్లీకి జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ కేబినెట్ కూర్పు ఉండనుంది. పార్టీని బలోపేతం చేసేందుకు కూడా జగన్  కార్యాచరణను సిద్దం చేసుకొంటారు. కేబినెట్ నుండి తప్పించిన వారికి పార్టీకి చెందిన కీలక బాధ్యతలను కట్టబెట్టే అవకాశం ఉంది.

2019 లో ఏపీ సీఎం వైఎస్ జగన్  మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలోనే రెండున్నర ఏళ్లపాటే మంత్రులుంటారని జగన్  చెప్పారు.  అయితే  మూడేళ్ల తర్వాత మంత్రివర్గాన్న పునర్వవ్యవస్థీకరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పినట్టుగానే ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలోనే మంత్రులను సీఎం జగన్ మంత్రుల నుండి రాజీనామాలు కోరారు. మంత్రులంతా రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios