Asianet News TeluguAsianet News Telugu

మాకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా లేదు.. కేంద్రం మరింతగా సహకరించాలి: సీఎం జగన్

దేశ ప్రగతికి ప్రధాని మోదీ రథ సారథి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందని చెప్పారు. 

cm jagan speech at visakhapatnam PM Modi Public meeting
Author
First Published Nov 12, 2022, 10:54 AM IST

దేశ ప్రగతికి ప్రధాని మోదీ రథ సారథి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నంలో జనసముద్రం కనిపిస్తుందని చెప్పారు. విశాఖలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభ వేదికపై నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది దిశగా ముందుకెళ్తోందని చెప్పారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రూ. 10,742 కోట్ల  ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే.. ప్రతి ఇళ్లు కూడా నిలదొక్కుకోవడం అని నమ్మి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మరింతగా సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తిగా కోలుకోలేదని అన్నారు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పనర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ది  కోసం చేసే ప్రతి పనిని ఇక్కడ ప్రజలు గుర్తుంచుకుంటారని  తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం అని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా ఉండదని చెప్పారు. 

విభజన హామీల నుంచి ప్రత్యేక హోదా, పోలవరం వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి పోలవరం వరకు... పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మంచి చేసే తమ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోదీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios