కాంట్రాక్ట్ లెక్చరర్లకు సీఎం జగన్ షాక్.. 700మంది ఉద్యోగాలు హుష్ కాకి..!
ఎయిడెడ్ డిగ్రీ కళాశాల విలీనం కాంట్రాక్టు లెక్చరర్లకు శరాఘాతంగా మారుతోంది. దశాబ్దాలుగా నడుస్తున్న కాలేజీలకు సాయం కోసేసి.. అక్కడ విధుల్లో ఉన్న తొమ్మిది వందల మంది లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : ‘కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగులకు ఉన్న అర్హతలే ఉన్నాయి. వారందరినీ పర్మినెంట్ చేయాలి. అలా చేస్తానని చెప్పి చేయకుండా నట్టేట ముంచొద్దు. ఒకవేళ మీరు చేయకుంటే మేం వచ్చి వారందరినీ పర్మినెంట్ చేస్తాం’... ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవీ.. అయితే ఇప్పుడు ఆ హామీకి ఎసరొచ్చింది. పర్మినెంట్ చేసే మాట అటుంచి ఏకంగా 700 మంది కాంట్రాక్టు లెక్చరర్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.
ఎయిడెడ్ డిగ్రీ కళాశాల విలీనం కాంట్రాక్టు లెక్చరర్లకు శరాఘాతంగా మారుతోంది. దశాబ్దాలుగా నడుస్తున్న కాలేజీలకు సాయం కోసేసి.. అక్కడ విధుల్లో ఉన్న తొమ్మిది వందల మంది లెక్చరర్లను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టింగ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయంతో ఆయా కళాశాలల్లో ఇప్పటికే Contract Lecturers గా పనిచేస్తున్న ఏడు వందల మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. ఇప్పటికే 350 మందిని గత 20 రోజులుగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మిగిలిన మూడు వందల యాభై మంది పరిస్థితి కూడా అయోమయంలో పడింది. Aided lecturersను ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు.
పిచ్చి తుగ్లక్ అని చదువుకున్నా.. ఇప్పుడు జగన్‌ని చూస్తున్నా, వైసీపీ పోతేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు
అంటే ఇప్పటివరకు Aided collegeల్లో పాఠాలు చెప్పిన వీరంతా ఇకపై ప్రభుత్వ కాలేజీలకే మాత్రమే పరిమితం కానున్నారు. మరో వైపు ఎయిడెడ్ కళాశాలలకు లెక్చరర్ల జీతాల రూపంలో ఇస్తున్న సాయం ఆగిపోయింది. అవిప్రైవేట్ కళాశాలలుగా మారిపోయాయి. విలీనం చేసుకున్న లెక్చరర్లకు ప్రభుత్వ కళాశాలలో పోస్టింగులు ఇస్తున్నారు.
దీంతో 21 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టులు పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలు కూడా పోయే స్థితి వచ్చిందని వాపోతున్నారు. రెండు దశాబ్దాల పైబడి లెక్చరర్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేసే దిశగా పరిశీలించకపోగా… ఇలా ఉద్యోగాలు తీసివేయడం దారుణం అంటున్నారు.