Asianet News TeluguAsianet News Telugu

కడప స్టీల్ ప్లాంట్ కు రూ.500కోట్లు... సీఎం జగన్ ఆదేశం

కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Jagan Review Meeting on kadapa steel plant
Author
Amaravathi, First Published Jun 15, 2020, 2:09 PM IST

అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. 

కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో జరిపిన చర్చల  వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. ఆ సంస్థలతో చర్చలు కొనసాగించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 

read more    ఆనాటి జేపి, కంచి పీఠాధిపతి మాటలే... నేటి వైసిపికి వర్తింపు: గోరంట్ల

ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలియజేశారు. రెండు సంవత్సరాల్లోగా టౌన్‌షిప్, అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించామని... ఈ నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామని సీఎంకు వివరించారు అధికారులు.

ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటును ఆర్టీపీపీ లైన్‌ ద్వారా తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే నిర్మాణ పనుల కోసం, ఆ తర్వాత ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios