ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం విజయవాడ నగరంలోని రీజనల్ పాస్ పోర్టు ఆఫీసుకు వెళ్లారు. ఈ సందర్భంగా డిప్లమేటిక్ పాస్ పోర్టును ముఖ్యమంత్రి దంపతులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారికి కేంద్ర విదేశాంగ శాఖ డిప్లమేటిక్ పాస్ పోర్టును జారీ చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఆ పాస్ పోర్టు తీసుకునేందుకు సీఎం దంపతులు పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చేశారు. గతంలో చంద్రబాబు నాయుడుకి కూడా ఈ పాస్ పోర్టు జారీ చేశారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన తన డిప్లమేటిక్ పాస్ పోర్టుని తిరిగి అధికారులకు అప్పగించారు. ఈ ఎన్నికల్లో వైసీప అధినేత జగన్ విజయం సాధించడంతో.. ఆయన శనివారం విజయవాడలోని ఎంజీ రోడ్డులో ఉన్న రీజనల్ పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి ఈ పాస్ పోర్టు తీసుకొని వెళ్లారు.