ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహా వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయమే ఏపీలోని తాడేపల్లి నుంచి హైదరాబాద్‌కు జగన్ తన అర్ధాంగి భారతితో బయల్దేరి వచ్చారు. వివాహా వేడుకకు హాజరైన జగన్ దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, ఈ వేడుకకు పలు పార్టీల నేతలు భారీగా హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కూడా పెద్దసంఖ్యలో రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు సందీప్, పూజితను ఆశీర్వదించారు. ఈ క్రమంలో కేటీఆర్, శ్రీధర్ బాబు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్‌తో ఫోటోలు దిగేందుకు వైసీపీ నేతలు,పెళ్లికి హాజరైన పలువురు అతిథులు పోటీపడ్డారు.
అటు ఈ వివాహా వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య విడివిడిగా విచ్చేశారు. నందమూరి బాలకృష్ణను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ పెళ్లి వేడుకకు బండ్ల గణేష్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.