ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భవనాన్ని ప్రారంభించారు.
ఆంధ్ర్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భవనాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణితో పాటు ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లం, మంత్రులు, శాసనసభ్యులు, ఎంపిలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2 ఎకరాల ప్రాంగణంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనానం నిర్మితమైది. 235 సీట్ల సామర్ధ్యంతొ సముదాయాన్నినిర్మించారు. ఒకేసారి 500 వాహనాలను పార్క్ చేసేందుకు వీలుగా సౌకర్యం కాడా ఉంది.
అదేవిధంగా 90 మంది శాసనమండలి సభ్యులు కూర్చునేందుకు సీటింగ్ ఏర్పాటు చేసారు. స్పీకర్ కూర్చునే వేదికను ఇతర సభ్యులు కూర్చునే ఫ్లోర్కన్నా సుమారు 7 అడుగుల ఎత్తులో నిర్మించారు. మైక్ సిస్టమ్ మొత్తం సెన్సర్ల ద్వారానే పనిచేస్తాయి. ఎక్కడా బయటకు మైకులు కనబడవు. స్పీకర్ కుర్చీకి ఇరువైపులా రెండు పెద్ద ఎల్ఇడి స్క్రీన్ టీవిలను ఏర్పాటు చేసారు. మొత్తం ఐదు అత్యాధునిక గ్యాలరీల్లో 2 మీడియాకు, ఒకటి అధికారులకు, వివిఐపిలకు 2 గ్యాలరీలను కేటాయించారు. రెండస్ధుల్లో నిర్మించిన అసెంబ్లీ, కౌన్సిల్ సముదాయానికి సుమారు రూ. 600 కోట్లు వ్యయమైంది.
