Asianet News TeluguAsianet News Telugu

1శాతం మెజార్టీతో అధికారంలోకి వచ్చాం..

  • కేవలం 1శాతం ఓట్ల ఆదిక్యంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చామని.. ఇప్పుడు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో 16శాతం ఓట్లు ఆధిక్యం సాధించామన్నారు.
  • రాష్ట్రంలోని 80శాతం ప్రజలను అన్నివిధాలా సంతృప్తి పరచాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.
CM Chandrababu Naidu to Hold 2 Days Collector Conference in AP

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధి విషయమై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల విజయం గురించి కూడా ఆయన వారితో చర్చించారు. కేవలం 1శాతం ఓట్ల ఆదిక్యంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చామని.. ఇప్పుడు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో 16శాతం ఓట్లు ఆధిక్యం సాధించామన్నారు. రాష్ట్రంలోని 80శాతం ప్రజలను అన్నివిధాలా సంతృప్తి పరచాలని ఆయన కలెక్టర్లకు సూచించారు.

 

రాష్ట్ర గ్రోత్ 15శాతం లక్ష్యంగా పెట్టుకోగా.. 11.7శాతం సాధించామని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ప్రజల్లో తమ ప్రభుత్వంపై 50శాతం సంతృప్తి ఉందని.. పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం రంగంలో అభివృద్ధి బాగుందన్నారు. డైరీ వ్యవస్థ వల్ల చాలా మంది రైతులు కరువును అధిగమించారన్నారు. హార్టి కల్చర్ లో అభివృద్ధి పెరుగుతోందన్నారు.

 

మోడల్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ కింద మండలాల, ప్రాంతాల వివరాలు సేకరిస్తున్నామన్నారు. సిటిజన్ మొబైల్ అప్లికేషన్ కింద ప్రతి కుటుంబం సమగ్ర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. చంద్రన్న భీమా ప్రజలకు భరోసా ఇస్తోందన్నారు. 50ఏళ్లలోపు వారు ఎవరైనా మృతిచెందితే రూ.2లక్షలు అందజేస్తామని.. ఈ పథకాన్ని అక్టోబర్ లో ప్రారంభిస్తామన్నారు.

 

కలెక్టర్ల సమావేశం గురించి డిప్యుటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గత కలెక్టర్ కాన్ఫరెన్స్ కి, ఈ సమావేశానికి మధ్యలో రెండు మంచి సంఘటనలు జరిగాయని .. అవే కాకినాడ, నంధ్యాల ఎన్నికలని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలే ప్రజల్లో టీడీపీ ఉన్న ఆదరణకు నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న  నమ్మకం ఈ ఎన్నికల ద్వారా తెలిసిందన్నారు.

ప్రజలు రెవిన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలను తగ్గించామని.. అన్ని ఆన్ లైన్ లోనే అందిస్తున్నామని చెప్పారు. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల కోరిక మేరకు సిట్ విచారణ గడువు పెంచినట్లు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలను కేవలం 15 నిమిషాల్లో అందిస్తున్నట్లు తెలిపారు. తుళ్లూరులో నూతన రిజిస్టార్ ఆఫీసును ప్రారంభించామన్నారు..

 

అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల మాట్లాడుతూ.. కాపిటివ్ ఆదాయం పెరిగిందన్నారు. వ్యవసాయ పరంగా గ్రోత్ 42శాతం మెరుగుపడిందన్నారు. పారిశ్రామిక రంగంలో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. సెజ్, ఇండస్ట్రియల్ పార్క్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్, గృహ , టూరిజం విభాగాల్లో అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios