బీజేపీ వైసీపీలది అక్రమ పొత్తు: చంద్రబాబు

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 10, Sep 2018, 7:33 PM IST
cm chandrababu naidu on bjp ysrcp alliance
Highlights

: బీజేపీ, వైఎస్ఆర్సీపీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీలు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. వైసీపీ, బీజేపీల పొత్తు అక్రమ పొత్తు అంటూ మండిపడ్డారు. 

అమరావతి: బీజేపీ, వైఎస్ఆర్సీపీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, వైసీపీలు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. వైసీపీ, బీజేపీల పొత్తు అక్రమ పొత్తు అంటూ మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఈడీ, ఐటీ, సీబీఐ నోటీసులు ఇచ్చి బెదిరించాలనుకుంటుందా అటూ ప్రశ్నించారు.  అధికారం మీకు శాశ్వతం కాదని గుర్తుంచుకోండంటూ వార్నింగ్ ఇచ్చారు. 

అధికారంలో రాగానే అవినీతిపరులను జైల్లో పెట్టిస్తానన్న మోదీ... ఇప్పుడు అదే అవినీతిపరులను వెంటేసుకొని తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులను ఒక్కొక్కటిగా సడలిస్తూ సాయం చేస్తున్నారని దుయ్యబుట్టారు. బీజేపీ, వైసీపీ అక్రమ కలయికను నిరూపిస్తా మీరు రాజీనామా చేస్తారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకు చంద్రబాబు సవాల్ విసిరారు.

loader