దేవాన్ష్‌ ను తన ఒడిలో కూర్చొబెట్టుకొన్న బాబు   పలకమీద అ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని మనవడితో రాయించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదివారం తన మనవడు దేవాన్ష్ అక్షరాభ్యాసాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిపించారు.

పద్మావతి విశ్రాంత సముదాయంలో దేవాన్ష్‌ ను తన ఒడిలో కూర్చొబెట్టుకొన్న బాబు పలకమీద అ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని మనవడితో రాయించారు.అనంతరం కుటుంబ సమేతంగా వైకుంఠం-1 మీదుగా క్యూలైన్‌ మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.