ముస్టిం ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మ‌రో ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. ముస్లిం మత పెద్దలతో సమావేశం అయ్యారు చంద్ర‌బాబు. ముస్లింల‌కు శాసన మండలి చైర్మన్‌ పదవి ఇస్తామని హామీ.

తెలుగుదేశం పార్టి నంద్యాల ఉప ఎన్నిక‌లో ఎల‌గైనా గెలవాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. అందులో భాగంగా అత్యధిక ఓట‌ర్లున్న ముస్లిం ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మ‌రో ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. ఇప్ప‌టికే ఒక ఎమ్మెల్సీ ప‌ద‌విని, ఒక చైర్మ‌న్ ప‌ద‌విని ముస్లింల‌కు కెటాయించిన టీడీపీ తాజాగా ముస్లింల‌కు శాసన మండలి చైర్మన్‌ పదవిని క‌ట్ట‌బెడతామ‌ని హామీ ఇచ్చింది.

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇవ్వాళ శాస‌న మండ‌లి చైర్మ‌న్ హామీని గుప్పించారు. నంద్యాలలో ఓ ఫంక్షన్‌హాల్‌లో ముస్లిం మత పెద్దలతో సమావేశం అయ్యారు చంద్ర‌బాబు. ముస్లింల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా ముస్లింలకు త‌మ ప్ర‌భుత్వం అధిక ప్ర‌ధాన్య‌త ఇస్తుందని పేర్కొన్నారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ఇప్ప‌టికే ప‌లు ప‌థ‌కాలను ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పారు, త్వ‌ర‌లో మండ‌లి చైర్మ‌న్ ప‌ద‌వి తో పాటు మ‌రిన్ని ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో ముస్లింలకు అధిక నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ముస్లింలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌ అభివృద్ధి ధ్వేయంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తొంద‌న్నారు. మంచి పనులు చేసేవారికి ప్రజలు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కులం, మతం పేరుతో కుట్రలు చేస్తే చూస్తే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు.