హాస్టల్ నుండి బాలిక కిడ్నాప్, రెండు రోజులుగా అత్యాచారం

First Published 27, Jul 2018, 5:17 PM IST
Class 10 student raped for three days west godavari district
Highlights

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతూ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటున్న ఓ బాలికను కిడ్నాప్ చేసి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు బాలికను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపించారు. 

దెందులూరు మండలం దుగ్గిరాలకు చెందిన ఓ బాలిక చింతలపూడి సాంఘీక సంక్షేమ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. అయితే ఆమెతో ఓ యువకుడు పరిచయాన్ని పెంచుకున్నాడు. బాలికకు స్వగ్రామానికి తీసుకెళతామని మాయమాటలు చెప్పి కవ్వగుంట గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను బంధించి మరో యువకుడితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. ఇలా రెండు రోజుల పాటు బాలికను అక్కడే బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అయితే రెండు రోజులుగా బాలిక కనిపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలిక కవ్వకుంటలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బాలికను అక్కడినుండి కాపాడి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
loader