కడప: జిల్లాలోని వేంపల్లి మండలంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వరుసగా మూడో రోజు కూడ ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఆదివారం నాడు ఇరువర్గాలు మరోసారి ఘర్షణకు దిగడంతో   నలుగురికి గాయలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే ఈ గొడవలు చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది.
మూడు రోజులుగా వైసీపీలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. 

also read:జమ్మలమడుగులో వైసీపీ నేతల మధ్య ఘర్షణ: రామ సబ్బారెడ్డి అనుచరుడు ప్రతాప్ రెడ్డి మృతి

వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వీరన్నగట్టుపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు మూడు రోజులుగా పరస్పరం దాడులు చేసుకొంటున్నారు. ఆదివారం నాడు కూడ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.

ఈ ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన పోలీసులు భారీగా మోహరించారు. ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇదే జిల్లాలోని జమ్మల మడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో రామ సుబ్బారెడ్డి వర్గానికి చెందిన ప్రతాప్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. ఇంకా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.