వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలి ఘర్షణకు దిగారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతూరులో బుధవారం చోటుచేసుకుంది.  సాతూరు గ్రామంలో మీసేవా కేంద్రం నిర్వహణ విషయంలో మాజీ సర్పంచి పోపూరి విద్యారాణి, ఉడతా వెంకటేశ్వరరావు వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో మాజీ సర్పంచ్ పై వెంకటేశ్వరరావు వర్గీయులు చేయిచేసుకోవడంతో విద్యారాణి కిందపడిపోయారు. వారిని అడ్డుకోబోయిన విద్యారాణి మరిది ప్రసాద్‌పై కూడా దాడిచేయడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

వీరిలో ఒక వర్గగం ప్రస్తుత ఎమ్మెల్యే విడదల రజనీ కి చెందిన వారు కాగా.. మరో వర్గం మాజీ ఎమ్మెల్యే మర్రి కి  చెందిన వారు కావడం గమనార్హం.