పెడన: వైసీపీలో రెండు వర్గాలు  పరస్పరం దాడులకు దిగాయి. కవ్వింపు చర్యలతో కొట్టుకొన్నారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్  కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.  జోగి రమేష్ వర్గీయుల దాడిలో ఉప్పాల వర్గీయులు ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడనలో శుక్రవారం నాడు చోటు చేసుకొంది.

కృష్ణా జిల్లా పెడనలో  వైసీపీ వర్గీయుల మధ్య గొడవ  చేసుకొంది. కవ్వింపు చర్యలతో ఒకరిపై మరోకరు దాడులకు పాల్పడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపై మరోకరు దాడులకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ కారు అద్దాలను  ఉప్పాల రాంప్రసాద్ వర్గీయులు  దాడికి దిగారు.

బస్టాండ్ సెంటర్లో ఇరు వర్గాలు పరస్పరం దాడికి దిగారు.  దీంతో ఉప్పాల రాంప్రసాద్‌కు చెందిన ఇద్దరు గాయపడ్డారు.