Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే ఫోటో లేకుండా ఫ్లెక్సీ.. వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్..!

ఎమ్మెల్యే ఫోటో లేని ఫ్లెక్సీ ఇక్కడ కట్టవద్దని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు.

Clashes Between Two YCP Leaders In Prodduturu
Author
Hyderabad, First Published Jan 15, 2022, 8:39 AM IST

వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది.  కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్  ల మధ్య అంతర్గత పోరు మరరోసారి రచ్చకెక్కింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు ప్రొద్దుటూరు పట్టణంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అయితే.. ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం. శుక్రవారం తెల్లవారుజామున శ్రీరాముల పేటలో ఎమ్మెల్సీ వర్గీయులు ఫ్లెక్సీ కడుతుండగా.. పదో వార్డు కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, ఆమె అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఫోటో లేని ఫ్లెక్సీ ఇక్కడ కట్టవద్దని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్ రెడ్డితో వాగ్వాదానికి దిగాడు.

అదే సమయంలో కౌన్సిలర్ కౌన్సిలర్ లక్ష్మీదేవి ఆమె భర్త మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి జరిగిందని రఘునాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంఘటనాస్థలికి వచ్చారు.

పోలీసులు  ఆయనను వారించి వెనక్కి తీసుకువెళ్లారు. మరో వైపు రమేష్ యాదవ్ కడపలో ఎస్పీ అన్బురాజన్ కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన వెళ్లిన కాసేపటికి పదో వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ విజయలక్ష్మి ఎస్పీని కలిశారు.

రమేష్ యాదవ్ పై ఫిర్యాదు చేశారు. కాగా.. ప్రొద్దుటూరు వైసీపీ లో ఎలాంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రమేష్ యాదవ్ బాగానే ఉన్నామని చెప్పారు. ఫ్లెక్సీ వివాదం సమయంలో కౌన్సిలర్ పై తాను తుపాకీ గురి పెట్టాడు అంటూ వచ్చే వార్తల్లో నిజం లేదని .. అవన్నీ అబద్దమని చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios