విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని 26వ వార్డులో అభివృద్ది పనుల శంకుస్థాపన సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ రగడ మొదలైంది. 

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని 26వ వార్డులో అభివృద్ది పనుల శంకుస్థాపన సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ రగడ మొదలైంది. వివరాలు.. అక్కయ్యపాలెంలో ఈరోజు రూ. 1.53 లక్షల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. శంకుస్థాపనకు జీవీఎంపీ మేయర్ హరి వెంకట కుమారి, విశాఖ నార్త్ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కేకే రాజు, పలువురు వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. 

అయితే అక్కడ ప్రోటోకాల్ పాటించడం లేదని టీడీపీ కార్పొరేటర్ శ్రావణి ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది. అది కాస్తా ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మరోవైపు ఇరు పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఇక, ప్రోటోకాల్ పాటించకుండా స్థానిక కార్పొరేటర్​కు ప్రాధాన్యం లేకుండా ఎందుకు చేస్తున్నారని వైసీపీ శ్రేణులపై శ్రావణి ఆగ్రహం వ్యక్తం చేశారు.