మూడు రాజధానుల వ్యవహారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ, వైసీపీ తీర్మానానికి టీడీపీ అభ్యంతరం

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు తీర్మానం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రతిపాదించడంపై టీడీపీ కార్పోరేటర్లు అభ్యంతరం తెలిపారు.

clash between tdp and ysrcp leaders in gvmc council meeting in visakhapatnam

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో మూడు రాజధానుల అంశం కాకరేపింది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తూ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు తీర్మానం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రతిపాదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చించి .. ఆ నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు. అయితే ఆ నిర్ణయంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అజెండాలో లేని అంశాలను చర్చకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. నినాదాలు చేస్తూ మేయర్ పోడియాన్ని చుట్టుముట్టారు తెలుగుదేశం కార్పోరేటర్లు. 

అంతకుముందు అక్టోబర్ 31న మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ... పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమని అన్నారు. ఏపీలో రాజధాని అవకాశం ఉన్న ఒకే ఒక్క పట్టణం విశాఖపట్నం అని చెప్పారు. మంత్రి  శివరామకృష్ణన్ కమిటీ పెద్ద క్యాపిటల్ వద్దని సలహా ఇచ్చిందని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ముసుగులో తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకేమి పట్టదని మండిపడ్డారు.

ALso REad:వికేంద్రీకరణకు మద్దతివ్వకపోతే నష్టపోతాం:స్పీకర్ తమ్మినేని సీతారాం

శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని ఆరోపించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చని విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. రెండేళ్లకే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని కటక్‌లో హైకోర్టు.. భువనేశ్వర్‌లో పరిపాలన రాజధాని ఉందని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా వికేంద్రీకరణ జరుగుతోందని అన్నారు. ఈనాడు రామోజీరావు వ్యాపారాలకు అడ్డం వస్తున్నాననే తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు. 

మంత్రి పదవి కంటే.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ధర్మాన చెప్పారు. వికేంద్రీకరణకు ఉద్యమంలో చురుగ్గా పాల్గనేందుకు మంత్రి పదవికి రాజీనామా  చేస్తానని సీఎం జగన్ చెప్పానని.. అయితే ఆయన రాజీనామా వద్దని అన్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉందని.. ఆ దిశగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios