కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కరీంబాషా, జలీల్ బాషా తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని వైద్యం కోసం నందికొట్కూరు ఆసుపత్రికి  తరలిస్తుండగా ఆ కారును సైతం సిద్ధారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.