Asianet News TeluguAsianet News Telugu

సీట్ల సర్దుబాటుపై రాని క్లారిటీ ? మరోసారి బాబు, పవన్ భేటీ.. బీజేపీతో పొత్తు ఉంటుందా?

ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మొదట మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయినా  విషయం కొలిక్కి రాకపోవడంతో మధ్యాహ్నం అర్ధాంతరంగా భేటీ ముగిసింది. ఆ తర్వాత మరోసారి రాత్రికి సమావేశమయ్యారు. ఈ సమావేశం 45 ని.లసేపు సాగింది.

Clarity on the adjustment of seats? Babu and Pawan meet again, Will there be an alliance with BJP? - bsb
Author
First Published Feb 5, 2024, 2:26 PM IST

అమరావతి : జనసేన టిడిపిలో మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు. ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడిగా  కూటమిగా వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే టిడిపి మండపేట, అరకు రెండు స్థానాల్లో అభ్యర్థులను విడిగా ప్రకటించింది. దీంతో జనసేన కూడా రాజానగరం,  రాజోలు మరో రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది.  మరోవైపు వైసీపీ ఇప్పటికే 85 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది.

ఈ క్రమంలో ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్,  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటు  విషయంలో మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక,  ఉమ్మడి మేనిఫెస్టోలో  ఉండాల్సిన అంశాల మీద కూడా కసరత్తు జరిగింది.  గతంలో కూడా  వీరిద్దరు సమావేశమైనప్పటికీ ఆదివారం నాడు వెంట వెంటనే రెండుసార్లు సమావేశం అవడం చర్చనీయాంశంగా మారింది.

ఉండవల్లి లోని చంద్రబాబు నాయుడు నివాసంలో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మధ్యాహ్నం భేటీ అయ్యారు. మొదట మూడు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. అయినా  విషయం కొలిక్కి రాకపోవడంతో మధ్యాహ్నం అర్ధాంతరంగా భేటీ ముగిసింది. ఆ తర్వాత మరోసారి రాత్రికి సమావేశమయ్యారు. ఈ సమావేశం 45 ని.లసేపు సాగింది. ఇందులో బిజెపితో పొత్తు విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక.. ఈ రెండు సమావేశాల్లో ఈ పార్టీలు పోటీ చేసే చాలా స్థానాలపై క్లారిటీ వచ్చిన ఇంకొన్ని స్థానాలపై స్పష్టత రాలేదట. 

వైసిపి సర్కార్ గవర్నర్ తోనే నీళ్లు నమిలించిందిగా..: టిడిపి ఎమ్మెల్యేల సెటైర్లు

 దీంతో మరోసారి ఫిబ్రవరి 8వ తేదీన భేటీ కావాలని చేయించుకున్నట్లుగా తేలింది. ఈ భేటీ అనంతరం మొత్తం సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇరు పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు పార్లమెంటు సమావేశాల తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళనున్నారని తెలుస్తోంది.  బిజెపితో పొత్తు విషయంపై మాట్లాడే అవకాశం ఉందని ఆ తరువాతే టిడిపి జనసేన పొత్తు మీద కూడా ఓ స్పష్టత వస్తుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

ఈనెల 8వ తేదీ తర్వాత.. 14వ తేదీన పాలకొల్లులో టిడిపి, జనసేన భారీ బహిరంగ సభ ఉంటుందన్న విషయంపై కూడా ఎలాంటి స్పష్టత లేదట.  ఈ  బహిరంగ సభలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సమాచారం.  ఉమ్మడి, ఉభయగోదావరి జిల్లాలలోని కొందరు నేతలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు త్యాగాలకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతాల్లో జనసేన కోరుకుంటున్న సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ఉన్నట్లుగా భావిస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు కానీ నేతలకు పార్టీలో..  తర్వాత ఏర్పడబోయే తమ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చబోమని వారికి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు చంద్రబాబు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios