Asianet News TeluguAsianet News Telugu

నా జీవితం ప్రారంభమైంది శ్రీశైలం నుంచే.. నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి శ్రీశైలం ఆలయాన్ని దర్శించారు. 

cji justice nv ramana visited srisailam ksp
Author
Srisailam, First Published Jun 18, 2021, 3:01 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం శ్రీశైలంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి శ్రీశైలం ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజులుగా తెలుగు గడ్డపై తిరుగుతూ తాను ఎంతో సంతోషాన్ని పొందుతున్నట్లు చెప్పారు. తాను న్యాయవాద వృత్తిని చేపట్టిన తొలినాళ్లలో శ్రీశైలం ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యప్ప రెడ్డి వద్ద జూనియర్‌గా చేరానని జస్టిస్ రమణ గుర్తుచేసుకున్నారు. ఈరోజు ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన అయ్యప్ప రెడ్డికి, ఆయన కుటుంబానికి సీజేఐ కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read:నా కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దు.. హైదరాబాద్ పోలీసులకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ విజ్ఞప్తి

కర్నూలు జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని జస్టిస్ రమణ తెలిపారు. ఈ జిల్లా నుంచే న్యాయవాద వృత్తిని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగానని ఆయన చెప్పారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి ఏడాది రెండు, మూడు సార్లు శ్రీశైలంకు వచ్చి స్వామిని, అమ్మవారిని దర్శించుకుంటున్నానని జస్టిస్ రమణ తెలిపారు. తాను శ్రీశైలంకు వస్తున్నానని చెప్పిన వెంటనే... అన్ని ఏర్పాట్లు చేసిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios