వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశంసించారు. తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే చెవిరెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డిని చీఫ్ జస్టిస్ ఆత్మీయంగా పలకరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘‘ ఏం.. భాస్కర్ బాగున్నావా... బాగా పనిచేస్తున్నావ్.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయమన్నారు. నువ్వు తయారు చేసిన ఔషధం నాకు కూడా అందిందని... నువ్వు ఇలాగే ప్రజా సంక్షేమం కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి అంటూ జస్టిస్ ఎన్ వీ రమణ ఆకాంక్షించారు.

Also Read:హైద్రాబాద్‌కు చేరుకొన్న సీజేఐ: ఘనస్వాగతం పలికిన తెలంగాణ సర్కార్

మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరంను సందర్శిస్తానని చెవిరెడ్డికి సీజేఐ తెలిపారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.