అమరావతి: సినీనటి, మాజీ ఎంపీ జయప్రద వైసీపీలో చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై జయప్రద స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం తర్వాత జయప్రద తిరిగి ఏపీ రాజకీయాల్లో చేరేందుకు ప్రయత్నాలను చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

తెలుగు, హిందీ సినీ రంగంలో జయప్రద గతంలో ఓ వెలుగు వెలిగారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జయప్రద ఆ పార్టీలో  చేరారు. టీడీపీ సంక్షోభం తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయప్రదకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కింది.

తెలుగుదేశంలో కొంత కాలం కొనసాగిన తర్వాత జయప్రద యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సమాజ్ వాదీ పార్టీలో జయప్రద  చేరారు. అమర్‌సింగ్ ద్వారా జయప్రద ఎస్పీలో చేరారు. ఎస్పీ ద్వారా ఆమె చాలా కాలం పాటు రాజ్యసభసభ్యురాలిగా కొనసాగారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీలో చోటు చేసుకొన్న సంక్షోభ సమయంలో అమర్‌సింగ్ పై అఖిలేష్ యాదవ్ పార్టీ నుండి తప్పించారు.ఈ సమయంలోనే జయప్రద కూడ పార్టీ నుండి తప్పుకొన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో తనకు ఇబ్బందులు రావడంతో ఏపీ రాజకీయాల వైపు జయప్రద కన్నేసినట్టు ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా ఆమె ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని చెబుతున్నారు.

ఏపీ రాష్ట్రంలోని జనసేన, వైసీపీ పార్టీల్లో ఏ పార్టీలో చేరాలనే విషయమై జయప్రద యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో జయప్రద చేరాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుండి పోటీ చేసేందుకు ఆమె సన్నాహలు చేసుకొంటున్నారని చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీ స్థానం నుండి ప్రస్తుతం సినీ నటుడు మురళీమోహన్ టీడీపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 

ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా జయప్రద పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని అంటున్నారు. అయితే జయప్రద ఏ పార్టీలో చేరుతారు, ఎప్పుడు ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడతారోననే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. లోక్‌సభ సీటు లేదా రాజ్యసభ సీటు కావాలని జయప్రద ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో చేరే విషయమై  జయప్రద అధికారికంగా ప్రకటించలేదు.

asianet news special

లక్ష నుంచి 25 కోట్లు.. తెలుగు ఓల్డ్ మూవీస్ కలెక్షన్స్ (1933-2002)

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన బాక్స్ ఆఫీస్ కథలు!