నాన్న రాజకీయం తెలియదు, జగన్ సూపర్: హీరో మంచు విష్ణు

First Published 1, Jun 2018, 4:32 PM IST
cine actor Manchu Vishnu praises on Ys   Jagan
Highlights

మోహన్ బాబు వైసీపీలో  చేరుతారా

ఏలూరు: నాన్న రాజకీయ ప్రవేశం గురించి తనకు
తెలియదని సీనీ హీరో  మంచు విష్ణు చెప్పారు. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంచు  విష్ణు మీడియాతో
మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు రెండు
వేల కిలోమీటర్ల దూరం వైఎస్ జగన్ ప్రయాణం చేయడం
సామాన్యమైన విషయం కాదన్నారు.

జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోనుందని ఆయన
అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సిన
అవసరం ఉందన్నారు. ర్యాంకులే ప్రామాణీకంగా
తీసుకోవద్దన్నారు విష్ణు.

ఎన్టీఆర్ బతికున్నకాలంలో మోహన్ బాబు టిడిపిలో ఉండేవాడు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడ బాబు నాయకత్వంలోని టిడిపిలో కొనసాగాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.అయితే కారణాలేమిటో కానీ, ఆయన టిడిపికి దూరమయ్యారు. అయితే వైఎస్ బతికున్న కాలంలో వైఎస్ కుటుంబానికి మోహన్ బాబు సన్నిహితంగా ఉండేవారు. అంతేకాదు ఆ కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి బంధుత్వం కూడ ఏర్పడింది.


 

loader