‘లైంగిక’ ఆరోపణలపై సిఐ సస్పెన్షన్

‘లైంగిక’ ఆరోపణలపై సిఐ సస్పెన్షన్

బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు అధికారుల్లో కొందరు అవకాశం తీసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా లైంగిక వేధిపుల ఘటనలో ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) వెంకటరావు సస్పెండ్ అవ్వటం పోలీసు శాఖలో సంచలనంగా మారింది.  ఇంతకీ ఏమి జరిగిందంటే, విశాఖపట్నంలోని హోటల్లో పనిచేసే వారణాసికి చెందిన  ఓ యువకుడు మలేషియాలో సాఫ్టేవేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యువతి ప్రేమించుకున్నారు. ప్రేమికుడి కోసమే ప్రియురాలు మలేషియాను వదిలేసి విశాఖపట్నంకు వచ్చేసింది.

కొద్ది రోజుల క్రితమే యువతి ప్రియుడు పనిచేసే హోటల్లోనే ఉద్యోగంలో చేరింది. అయితే, వారిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలీదు కానీ కొద్ది రోజుల తర్వాత యువకుడు ఉద్యోగం వదిలేసి విశాఖపట్నం నుండి వెళ్ళిపోయాడు.  కొద్ది రోజుల ఎదురుచూసిన యువతి ప్రియుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ప్రియుడు పంజాబ్ లో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత విశాఖకు తీసుకొచ్చి జైలుకు తరలించారు.

అయితే, ప్రియుడిని జైలుకు పంపితే తర్వాత తనను వివాహం చేసుకోడని ఆందోళన పడిన యువతి జైలుకు పంపవద్దని సిఐను కోరింది. దాన్ని అవకాశంగా తీసుకున్న సిఐ యువతిపై వేధిపులు మొదలుపెట్టాడు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 28న నేరుగా యువతి ఉంటున్న హోటల్ గదికే వెళ్ళి లైంగిక దాడికి దిగారు. దాంతో యువతి సిఐ ప్రవర్తనను వీడియో తీసి తర్వాత గదిలో నుండి బయటపడింది. నేరుగా నగర కమీషనర్ ను కలిసి సిఐపై ఫిర్యాదు చేసింది. కమీషనర్ వెంటనే విచారణకు ఆదేశించారు. యువతి అందించిన వీడియో సాక్ష్యాల ఆధారంగా కమీషనర్ సిఐను సస్పెండ్ చేసారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos