అనంతపురం: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డికి మీసం తిప్పి సవాల్‌ విసిరి వార్తల్లో నిలిచిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 

శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను మాధవ్ కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసులో చేరుతారని ప్రచారం సాగుతోంది. గత 22 ఏళ్లుగా పోలీసు శాఖలో మాధవ్ పనిచేస్తున్నారు. 

పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా జేసీ దివాకర్‌ రెడ్డికి సవాలు విసిరారు. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ నుంచి ఆయనకు హామీ వచ్చినట్లు చెబుతున్నారు.

సంబంధిత వార్త

నాలుక కోస్తానంటూ జేసీకి అప్పుడు వార్నింగ్: ఇక పొలిటికల్ వార్